Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

32.2 మిలియ‌న్లకు చేరుకున్న షారుక్ ట్విట్ట‌ర్‌ ఫాలోవ‌ర్ల సంఖ్య‌

  • అమితాబ్ త‌ర్వాత స్థానంలో షారుక్‌
  • ఖాన్ త్ర‌యంలో ఎక్కువ ఫాలోవ‌ర్లు ఈయ‌న‌కే!
  • అభిమానుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపిన న‌టుడు
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ ట్విట్ట‌ర్ ఫాలోవ‌ర్ల సంఖ్య 32.2 మిలియ‌న్ల‌కు చేరుకుంది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఓ ట్వీట్ చేసి అభిమానులకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ప్ర‌స్తుతం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ఫాలోవ‌ర్ల సంఖ్య‌కు చేరువ‌లో షారుక్ ఉన్నారు. అమితాబ్ బ‌చ్చ‌న్ ఫాలోవ‌ర్ల సంఖ్య 32.4 మిలియన్లు.

ఇక ఖాన్ త్ర‌యంలో ఆమిర్‌, స‌ల్మాన్‌ల కంటే ముందంజ‌లో ఉన్నారు. ట్విట్ట‌ర్‌లో స‌ల్మాన్ ఖాన్‌కి 29.9 మిలియ‌న్లు, ఆమిర్ ఖాన్‌కి 22.6 మిలియ‌న్ల మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. డిజిట‌ల్ మీడియాలో షారుక్ ఖాన్ చాలా క్రియాశీలకంగా ఉంటారు. త‌న సినిమాల విష‌యాలు, వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను కూడా షారుక్ అభిమానుల‌తో పంచుకుంటుంటారు. షారుక్ త‌ర్వాతి చిత్రం 'జీరో' ఫ‌స్ట్ టీజ‌ర్ నిన్న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే.
Shahrukh Khan
twitter
followers
Amitabh Bachchan

More Telugu News